హైదరాబాద్, ఆట ప్రతినిధి : సికింద్రాబాద్ క్లబ్ జీఎమ్ఆర్ స్పోర్ట్స్ యూత్ ఓపెన్ రెగట్టా టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన 11 ఏండ్ల ఆన్యా రెడ్డి అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆతిథ్య సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్‌కు చెందిన అన్యా ఆప్టిమిస్ట్ గ్రీన్ బాలికల విభాగంలో బుధవారం జరిగిన పోటీల్లో సత్తా చాటి అగ్రస్థానంలో నిలిచింది.
మహిళల ఐఎల్సీఏ 4 విభాగంలో తులసి పాట్లే టాప్‌లో నిలవగా, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్‌కు చెందిన కృతిక విశ్వనాథన్ రెండో స్థానాన్ని సాధించింది. ఆప్టిమిస్ట్ మెయిన్ బాలికల విభాగంలో శృంగారి రాయ్ రెండో రోజూ తన టాప్‌ప్లేస్‌ను కాపాడుకోగా.. టీఎస్ఏకు చెందిన ఎస్కే రమీజా భాను, ఎస్ఎస్సీ సెయిలర్ సృష్టి సింగ్ 2,3వ ర్యాంకుల్లో ఉన్నారు. ఆప్టిమిస్ట్ మెయిన్ బాలుర విభాగంలో టీఎస్ఏ సెయిలర్ బి. రవికుమార్ కూడా తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు.