చండూరు, మార్చి 11 : మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ది సాధ్యమని కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీచరణ్ అన్నారు. మంగళవారం చండూరు మండలం పుల్లెంల జడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో ఇన్చార్జ్ హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన “అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయినులను సన్మానించారు.
అనంతరం కస్తూరి ఫౌండేషన్ సభ్యుడు పిన్నింటి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత్రి సావిత్రిబాయి ఫూలే సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ సభ్యులు ఇరిగి శివ, ముక్కాముల రాజు, ముక్కాముల సైదులు, ఉపాధ్యాయులు రాపోలు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయినులు హైమావతి, కూపిరెడ్డి సువర్ణ, సునీత, సుగుణ, లక్ష్మీ , స్వప్న, జ్యోతి పాల్గొన్నారు.