22A Victim | కాంగ్రెస్ సర్కార్ 22A సెక్షన్ పేరుతో భయాందోళలకు గురి చేస్తుందని బాధితులు వాపోతున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని వసంత్ నగర్ డివిజన్లో 22A బాధితుడొకరు మీడియాతో మాట్లాడుతూ.. 2025 ఏప్రిల్ నుంచి అనుమతులు నిలిపేశారు. తర్వాత కొన్ని రోజులు రిజిస్ట్రేషన్లు ఆపారు.. మళ్లీ చేశారు. గత డిసెంబర్ నుంచి కూడా మళ్లీ రిజిస్ట్రేషన్లు ఆపారన్నాడు.
వసంత్ నగర్లో నేను ఒక 250 చదరపు అడుగుల హుడా ఆమోదిత హౌసింగ్ ప్లాట్‌కు చెందిన వ్యక్తిని నేను. కానీ మొత్తం వసంత్ నగర్ కాలనీ, సీబీసీఐడీ కాలనీ ఎన్ఆర్ఎస్ఏతోపాటు వసంత్ నగర్ డివిజన్లో ఉన్న ఎన్నో కాలనీలు 22 ఏలో చేర్చారు. అందులో ఇళ్లు కట్టుకున్నం.. నాలుగేళ్లుగా ఉంటున్నాం. ఇదే జీహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకున్నం. 2020లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అమ్ముకోవడానికి కానీ, పిల్లలకు ఏమైనా అవసరముండి లోన్లు తీసుకుందామన్నా అన్నింటికీ ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
వసంత్ నగర్ డివిజన్లో ఉన్న ఎన్నో కాలనీలను 22Aలో చేర్చి గత సంవత్సరం నుండి రిజిస్ట్రేషన్లు ఆపేశారు
ఇప్పుడు ఈ భూములు అమ్ముకోడానికి కానీ, లోన్లు తీసుకోవడానికి కానీ వీలు లేకుండా చేశారు
– 22A బాధితులు https://t.co/j1SPIsP1fT pic.twitter.com/uDwFCf89Ge
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2026
Vemulawada | రంగు నీళ్లతో వీధి కుక్కలకు చెక్..! వేములవాడలో పట్టణ ప్రజల వింత ప్రయోగం
‘విద్యారంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం’
Jobs | నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్లో 376 ఖాళీలు