నాగర్‌కర్నూల్, జూలై 26 : సృష్టికి మూలం అమ్మ అని మాజీ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నెలపొడుపు సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య రచించిన ‘పసరంటిన కొడవలి’ పుస్తకాన్ని నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కోయి కోటేశ్వర్రావు ఆవిష్కరించారు.
నెలపొడుపు సాహిత్యవేదిక ప్రధాన కార్యదర్శి వహీద్‌ఖాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. అమ్మల కృషిని వనపట్ల సుబ్బ య్య పసరంటిన కొడవలి రూపంలో తీర్చిదిద్దడాన్ని ప్రశంసించారు.