– టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ
రుద్రంపూర్, అక్టోబర్ 06 : 2025–26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, ఎలాంటి మినహాయింపులు లేకుండా 36 శాతం లాభాల వాటాను కార్మికులకు చెల్లించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాబు కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల కష్టార్జితంతో సంస్థకు లాభాలు వస్తున్నాయని, కాబట్టి వాస్తవ లాభాలను ప్రకటించి, కార్మికులకు న్యాయమైన వాటా అందించాలని కోరారు. లాభాల ప్రకటనలో ఎలాంటి మినహాయింపులు చేయకుండా 36 శాతం వాటాను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ లీగల్ అడ్వైజర్ జీకే సంపత్, సెంట్రల్ కమిటీ నాయకులు బోరింగ్ శంకర్, కాగితపు విజయ్‌కుమార్, ఎంటెక్ మహేందర్, విద్యాసాగర్, రాజ్‌కుమార్, కుమార్, పూర్ణ, రాములు, అరె దివ్య, నరేష్, హైమద్, పాషా పాల్గొన్నారు.