హుజూర్నగర్, ఏప్రిల్ 17 : హుజూర్నగర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్ నియమితులయ్యారు. భువనగిరి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్న ఎన్.శ్యామ సుందర్ ను హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఇక్కడ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన రాధాకృష్ణ చౌహాన్ పదోన్నతిపై బదిలీ కాగా అప్పటినుండి హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు పోస్టు ఖాళీగా ఉండగా కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ ఇన్చార్జి జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ లోగా నూతన న్యాయమూర్తి తన బాధ్యతలను స్వీకరించనున్నారు.