Harivansh: రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌గా మూడోసారి హరివంశ్ ఎన్నిక
Harivansh : హరివంశ్ హ్యాట్రిక్ కొట్టారు. మూడోసారి ఆయన రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. సభాపక్ష నేత జేపీ నడ్డా తీర్మానం పాస్ చేయగా .. హరివంశ్ ఎన్నిక ప్రక్రియ లాంఛనంగా పూర్తి అయ్యింది. మోదీ, ఖర్గేలు హరివంశ్‌కు కంగ్రాట్స్ తెలిపారు.
న్యూఢిల్లీ: హరివంశ్(Harivansh) హ్యాట్రిక్ కొట్టారు. మూడోసారి ఆయన రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. సభాపక్ష నేత జేపీ నడ్డా తీర్మానం పాస్ చేయగా .. హరివంశ్ ఎన్నిక ప్రక్రియ లాంఛనంగా పూర్తి అయ్యింది. మోజువాణీ ఓటు ద్వారా డిప్యూటీ చైర్మెన్ నియామకం జరిగింది. హరివంశ్‌ను ఎన్నుకునేందుకు అయిదు తీర్మానాలను పాస్ చేశారు. ఏప్రిల్ 9వ తేదీన రాజ్యసభ సభ్యుడిగా హరివంశ్ రెండో టర్మ్ ముగిసింది.దీంతో డిప్యూటీ చైర్మెన్ పోస్టు ఖాళీ ఏర్పడింది. రాజ్యసభ్య వ్యవహారాల ప్రకారం రూల్ 7 కింద చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ .. డిప్యూటీ చైర్మెన్ కోసం ఎన్నిక నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాజ్యసభకు హరివంశ్‌ను నామినేట్ చేశారు. మూడోసారి డిప్యూటీ చైర్మెన్‌గా గెలిచిన హరివంశ్‌కు ప్రధాని మోదీ, విపక్షనేత ఖర్గు కంగ్రాట్స్ తెలిపారు. రాజ్యసభ చరిత్రలో ఓ నామినేటెడ్ సభ్యుడు డిప్యూటీ చైర్మెన్‌గా ఎన్నిక కావడం ఇదే తొలిసారి. గతంలో హరివంశ్ జర్నలిస్టుగా చేశారు. విపక్షాలకు తగిన సమయాన్ని డిప్యూటీ చైర్మెన్ కేటాయిస్తారని భావిస్తున్నట్లు ఖర్గే చెప్పారు. హరివంశ్ ఎన్నికపై తీర్మానం పాస్ చేసిన సమయంలో సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ వాకౌట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

