ఫేస్బుక్లో పరిచయమైన ఓ మహిళపై ఎస్సై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ దారుణం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. ఎస్సై శ్రీకాంత్‌కు 2025లో ఫేస్బుక్లో ఒక మహిళ పరిచయమైంది. ఇద్దరూ చాటింగ్ చేసుకునే క్రమంలో సదరు మహిళ భర్త చనిపోయాడని ఎస్సై తెలుసుకున్నాడు. అనంతరం ఓ కేసు పనిమీద హనుమకొండ వెళ్లినప్పుడు ఫోన్ చేసి లొకేషన్ పంపించాలని కోరాడు. అందుకు ఆమె కూడా సానుకూలంగా స్పందించి.. లొకేషన్ పంపించింది. దీంతో మహిళ ఇంటికి వెళ్లిన ఎస్సై శ్రీకాంత్ ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఎస్సై శ్రీకాంత్ 15 రోజుల క్రితమే జమ్మికుంట పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది.