Dharmasagar | పల్లె దవాఖాన డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ మహేందర్ ఎన్నిక
Dharmasagar | తెలంగాణ పల్లె దవాఖాన డాక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలను అసోసియేషన్ సభ్యులు ఆన్ లైన్ ఓటింగ్ తో ఎన్నుకున్నారు.
ధర్మసాగర్ : తెలంగాణ పల్లె దవాఖాన డాక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలను అసోసియేషన్ సభ్యులు ఆన్ లైన్ ఓటింగ్ తో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ధర్మసాగర్ పల్లె దవాఖాన వైద్యాధికారి డాక్టర్ మహేందర్ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు తెలిపారు. ప్రధాన కార్యదర్శి గా డాక్టర్ ఎస్.సంగీత ఎన్నికైయ్యారు. అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షుడిగా డా. పుట్ట మహేందర్ రావు 977 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. భారీ ఆధిక్యంతో గెలుపొందడం సంఘ సభ్యుల నమ్మకానికి నిదర్శనమని మహేందర్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పల్లె దవాఖాన వైద్యుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, వ్యవస్థ అభివృద్ధి కోసం మరింత బలమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నట్టు తెలిపారు.
అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా ముందుకు సాగుతూ పల్లె దవాఖాన వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. ఈ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మొదటిసారిగా ఆన్లైన్ విధానంలో విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్ డాక్టర్ దశ్రత్ నాయక్, డాక్టర్ జైపాల్ రెడ్డి, ఎలక్షన్ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తన ఎన్నికకు మద్దతు తెలిపిన ప్రతి వైద్యుడికి ధన్యవాదాలు ప్రకటించారు. త్వరలోనే జిల్లా కమిటీలను ఎన్నుకొనున్నట్లు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

