హోవ్ : ఇంగ్లీష్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో గ్లామోర్గన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత బ్యాటర్ శుబ్‌మన్ గిల్..ససెక్స్‌తో మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. తొలి రోజు 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన గిల్ రెండో రోజు సెంచరీ పూరించి 119(139 బంతుల్లో, 16ఫోర్టు, 2 సిక్సర్లు) పరుగులకు అవుటయ్యాడు. గిల్ ప్రతిభతో గ్లామోర్గన్ 7 వికెట్లకు 411 పరుగులు చేసిన తరుణంలో వర్షం రాకతో ఆటను నిలిపివేశారు. డేవిడ్ లాయిడ్ (56), క్రిస్ కుక్(81నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. బ్రాడ్లీ కర్రీ 3, సీన్ హంట్, జాక్ కార్సన్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.