కాంగ్రెస్‌కు కష్టమే..
కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి పవర్లోకి రావడం.. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం..అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతో లోక్‌సభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్‌గా మారాయి.
- అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింట గెలిచి పటిష్ట స్థితిలో బీఆర్ఎస్
- ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు 65వేల పైచిలుకు ఆధిక్యం
- పార్టీ ఫిరాయించిన రంజిత్‌రెడ్డికి ముచ్చెమటలే!
- పాత, కొత్త నేతల మధ్య కొనసాగుతున్న వైరుధ్యాలు
- లోక్‌సభ ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపనుండడంతో కాంగ్రెస్‌లో ఆందోళన
- టాప్ గేర్‌లో దూసుకుపోతున్న ‘కారు’
రంగారెడ్డి, మే 10 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి పవర్లోకి రావడం.. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం..అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతో లోక్‌సభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్‌గా మారాయి.
ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ తరపున ఎంపీగా బరిలో ఉన్న రంజిత్‌రెడ్డి చేవెళ్ల ఎన్నికల్లో అసలు పరీక్షను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్‌కు చేవెళ్లలో విజయం అనేదే లేకపోగా..సొంత పార్టీలోనే నెలకొన్న సహాయ నిరాకరణ పరిస్థితులు రంజిత్‌రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిచి పటిష్ట స్థితిలో ఉన్న కారు చేవెళ్లలో దూసుకుపోతుండగా..కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం వెంటాడుతున్నది.
పటిష్ట స్థితిలో బీఆర్ఎస్..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచే చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వరుసగా విజయం సాధించారు. అసెంబ్లీ ఫలితాల్లో ఇతర ప్రాంతాలకు భిన్నంగా ప్రజలు తీర్పునిచ్చి లోక్‌సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పక్షానే నిలిచారు.
ఈ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో.. చేవెళ్ల, మహేశ్వ రం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీల్లో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీకి 65 వేల పైచిలుకు ఓట్లు అధికంగా వచ్చాయి. దీంతో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రజల నుంచి ఇదే ఆదరణ లభిస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితులు..
చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి ఎదురీదుతున్నారు. ఓవైపు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వస్తుండడం ..బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో వివిధ వర్గాల వారి సహాయ నిరాకరణ అతడిని కలవరపెడుతున్నది. కొత్త, పాత నేతల మధ్య వైరుధ్యాలు నేటికీ అక్కడక్కడా కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల నేతలు సహకరించడం లేదు. ఇవన్నీ ప్రస్తుత ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుండడంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. నేతల మధ్య సమన్వయం తీసుకొచ్చేందుకు అగ్రనేతలు చొరవ చూపకపోవడంతో ప్రచారంలోనూ కొందరు నేతలు పాల్గొనడం లేదని తెలుస్తున్నది.
దీనికితోడు క్షేత్రస్థాయిలోనూ పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కరువు పరిస్థితులు ఏర్పడి పంటలు ఎం డిపోయాయి. అంతేకాకుండా రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలు పత్తాలేకుండాపోయాయి. రూ.500 బోనస్‌ను సైతం కాంగ్రెస్ పార్టీ అటకెక్కించింది. రైతు లు కష్టకాలంలో ఉన్నా కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల నాటి హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్‌పై సబ్బండ వర్ణాల వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి దిగజారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న టాక్ వినిపిస్తున్నది.
టాప్ గేర్‌లో ‘కారు’..
చేవెళ్లలో కారు టాప్ గేర్‌లో దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నారు. ద్విముఖ వ్యూహంతో వెళ్తున్న బీఆర్ఎస్కు చేవెళ్లలో పరిస్థితులు రోజురోజుకూ అనుకూలంగా మారుతున్నాయి. కాసాని జ్ఞానేశ్వర్ బీసీ నేత కావడంతో బీసీ నినాదాన్ని నేతలు ప్రచారంలో బలంగా జనంలోకి తీసుకెళ్తున్నారు. దీంతో చేవెళ్ల లోక్‌సభలో మెజార్టీగా ఉన్న బీసీ ఓటర్లు ఏకతాటిపైకి వచ్చి కాసానిని గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.
మరోపక్క కాంగ్రెస్, బీజేపీ పాలన వైఫల్యాలను ప్రచారాస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా కదనరంగంలో ముందు కు సాగుతున్నారు. క్యాడర్ సైతం సమరోత్సాహంతో కాసాని గెలుపుకోసం కదం తొక్కుతున్నది. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నీతానై కాసాని గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభలో బీఆర్ఎస్ గత వైభవాన్ని చాటుతుందన్న చర్చ స్థానికంగా జోరుగా సాగుతున్నది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

