హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి బీ శివధర్‌రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకం చెల్లదంటూ గతంలో దాఖలైన పిటిషన్లోనే ఈ మధ్యంతర పిటిషన్ వేశారు. డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకం ప్రకాశ్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలకు వ్యతిరేకమంటూ ధన్‌గోపాల్‌రావు గతంలో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ విచారణలో ఉండగానే శివధర్‌రెడ్డి ఉద్యోగ విరమణ చేశారు. రిటైర్ అయిన రోజునే గత నెల 29న రాష్ట్ర ప్రభుత్వం ఆయనను రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమిస్తూ జీవో 550 జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ ధన్‌గోపాల్‌రావు మరో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.