Kannappa | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం కన్నప్ప (Kannappa). ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్, ఐశ్వర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప నుంచి లాంచ్ చేసిన టీజర్‌తోపాటు వివిధ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా శివ శివ శంకరా లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. శివుడిపై కన్నప్పకున్న భక్తి భావాన్ని ప్రతిబింబించేలా శివ శివ శంకరా లిరికల్ వీడియో సాంగ్ సాగుతూ సినిమా థీమ్ ఎలా ఉండబోతుందో చెబుతోంది. ఈ పాటను శ్రీశ్రీ రవిశంకర్ లాంచ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను విజయ్ ప్రకాశ్ పాడాడు.
ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ మూవీని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కన్నప్ప మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మంచు విష్ణు నుంచి వస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో కన్నప్పపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
శివ శివ శంకరా లిరికల్ వీడియో సాంగ్..
Deeply blessed to have had the honor of Sri Sri Ravi Shankar Guruji launch the first song of Kannappa at his serene ashram.#kannappa #srisriravishankar #divineblessings #firstsonglaunch #HarHarMahadevॐ @Gurudev @artoflivingg @themohanbabu @StephenDevassy @mukeshvachan… pic.twitter.com/h9Cd3usaSo
— Vishnu Manchu (@iVishnuManchu) February 11, 2025
Bandla Ganesh | నోటి దూలతో సమస్య రావడం దారుణం.. విశ్వక్సేన్ లైలా వివాదంపై బండ్ల గణేశ్
Akkineni Nagarjuna | నిన్ను చూసి గర్వపడుతున్నా.. నాగచైతన్య తండేల్ సక్సెస్‌పై అక్కినేని నాగార్జున