చెన్నై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ 100వ విజయాన్ని నమోదు చేసింది. 14వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 10 పరుగులతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మైల్స్టోన్ విజయంపై ఆ టీమ్ కోఓనర్, బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్ స్పందించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆదివారం అర్ధరాత్రి సమయంలో అతడు ట్వీట్ చేశాడు. 100వ ఐపీఎల్ మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉంది. అందరు ప్లేయర్స్ బాగా ఆడారు అని ఒక్కో ప్లేయర్ పేరును అతడు ప్రత్యేకంగా ట్యాగ్ చేశాడు.
ఐపీఎల్లో 100 విజయాలు సాధించిన మూడో టీమ్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. ఈ లిస్ట్‌లో ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ టాప్‌లో ఉంది. ఆ టీమ్ మొత్తం 204 మ్యాచ్‌లు ఆడి 120 గెలిచింది. ఇక మూడుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది. ఆ టీమ్ 180 మ్యాచ్‌లు ఆడి 106 గెలిచి, 73 ఓడిపోయింది.
Good to hav our 100th IPL match win. Well done boys…@KKRiders @prasidh43 @DineshKarthik @NitishRana_27 #Rahul @Russell12A @harbhajan_singh ( good to see u even if briefly )@Sah75official @patcummins30 actually all were so good to watch.
— Shah Rukh Khan (@iamsrk) April 11, 2021
ఇవి కూడా చదవండి
రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌కు బాఫ్టా నివాళులు
కొవిడ్ భయాలు.. దారుణంగా పతనమైన స్టాక్ మార్కెట్
కరోనా కల్లోలం.. ఇండియాలో కొత్తగా 1.69 లక్షల కేసులు
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!
బెస్ట్ డైరక్టర్ జావో.. నోమాడ్‌ల్యాండ్‌కు నాలుగు బాఫ్టా అవార్డులు
కుంభమేళా.. కొవిడ్ నిబంధనలు పాటించని భక్తులు
బాఫ్టా అవార్డ్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రియాంక చోప్రా, నిక్