కొత్తూరు, మార్చి 3: మున్సిపాలిటీలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను త్వరలో పూర్తిచేస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో 2,3,8,9,10,11 వార్డులో సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పర్యటించారు. వార్డులో జరుగుతున్న అభివృద్ధి, అసంపూర్తి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను వీలైనంత త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు. అలాగే స్టేషన్ తిమ్మాపూర్ అంగన్వాడీకి మరమ్మతులు పూర్తిచేస్తామని పేర్కొన్నారు. ఎండాకాలం వచ్చినందున మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అలాగే నాయకులు క్రీడలకు ఆడేందుకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే త్వరలో మున్సిపాలిటీలో క్రీడా మైదానం ఏర్పటుకు కృషి చేస్తానని అన్నారు .
ఈ కార్యక్రమంలో కొత్తూరు మున్సిపల్ కమిషనర్ బాలాజీ, ఏఈ నరేశ్, నాయకులు జాండగూడెం సుదర్శన్‌గౌడ్, వీరమోని దేవేందర్, సరేందర్, నర్సింహా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.