హనుమకొండ చౌరస్తా, నవంబర్ 3 : హనుమకొండలోని జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లో జరిగిన 69వ ఎస్జీఎఫ్ఐ రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ అండర్-14, 17, 19, జూడో అండర్-17 జూడోలో ప్రతిభ కనబర్చిన పలువురు క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 300 మంది జిమ్నాస్టిక్స్, 200 మంది జూడో క్రీడల్లో పాల్గొన్నారు. జూడో గర్ల్స్ అండర్-17లో 36 కేజీల్లో జీ శృతి (కరీంనగర్, గోల్డ్), ఎం విమలశ్రీ (నల్గొండ, సిల్వర్), 40 కేజీల్లో వీ సిరిచందన (వరంగల్, గోల్డ్), నిఖిత (నల్గొండ, సిల్వర్), 44 కేజీల్లో డీ నాగినిప్రియ (ఆదిలాబాద్, గోల్డ్), డీ వర్షిత (కరీంనగర్, సిల్వర్), 48 కేజీల్లో డీ సహస్ర (ఆదిలాబాద్, గోల్డ్), సీహెచ్ మన్వితశ్రీ (కరీంనగర్, సిల్వర్), 52 కేజీలు జీ రుక్మిణి (వరంగల్, గోల్డ్), టీ సింధు (ఆదిలాబాద్, సిల్వర్), 57 కేజీల్లో పీ అక్షిత (ఆదిలాబాద్, గోల్డ్), అంకితనాయక్ (కరీంనగర్, సిల్వర్), 63 కిలోల్లో ఏ సుష్మిత (కరీంనగర్, గోల్డ్), రిషితరాజ్ (నిజామాబాద్, సిల్వర్), 70 కిలోల్లో కే రేవతి (వరంగల్, గోల్డ్), మన్విత (కరీంనగర్, సిల్వర్) ప్లస్ 70 కేజీల్లో వీ యోగితరెడ్డి (కరీంనగర్, గోల్డ్), లక్ష్మీప్రసన్న (ఖమ్మం, సిల్వర్) పతకాలు సాధించారు.
బాయ్స్ అండర్-17 40 కేజీల్లో ఎస్ మనోజ్‌కుమార్ (ఆదిలాబాద్, గోల్డ్), పీ ప్రతీక్గౌడ్ (రంగారెడ్డి, సిల్వర్), 45 కేజీలు ఎం ప్రవీణ్ (ఖమ్మం, గోల్డ్), ముజాకిర్అలీ (హైదరాబాద్ సిల్వర్), 50 కేజీలు బీ రాఘవ (మెదక్, గోల్డ్), బీ గణేశ్ (కరీంనగర్, సిల్వర్), 55 కేజీల్లో ఆర్ తరుణ్ (ఆదిలాబాద్, గోల్డ్), ఏ మణికంఠ (నిజామాబాద్, సిల్వర్), 60 కేజీల్లో ఎం హర్షవర్ధన్ (ఆదిలాబాద్, గోల్డ్), యు మణిదీప్ (రంగారెడ్డి, సిల్వర్), 66 కేజీల్లో కే శ్రీహరి (వరంగల్, గోల్డ్), పీ లోకేశ్ (ఆదిలాబాద్, సిల్వర్), 73 కేజీల్లో బి రాంచరణ్ (మెదక్, గోల్డ్), ఏ అభినవ్సాయి (కరీంనగర్, సిల్వర్), 81 కేజీల్లో ఆర్ మధు (ఆదిలాబాద్, గోల్డ్), జే భరత్‌రాజ్ (కరీంనగర్, సిల్వర్), 90 కేజీల్లో ఏ సంతోష్ (ఆదిలాబాద్, గోల్డ్), సాయిహరిరెడ్డి (వరంగల్, సిల్వర్), ప్లస్ 90 కేజీల్లో టీ రణవీర్రాజ్ (కరీంనగర్, గోల్డ్), సంతోష్ (వరంగల్, సిల్వర్) మెడల్స్ సాధించారు. అలాగే జిమ్నాస్టిక్స్లోనూ క్రీడాకారులు ప్రతిభచాటి మెడల్స్ సాధించారు. ఈ నెలలోనే వెస్ట్‌బెంగాల్‌లో జిమ్నాస్టిక్స్, అరుణాచల్‌ప్రదేశ్‌లో జూడో జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని ఎస్జీఎఫ్ఐ సెక్రటరీ వీ ప్రశాంత్‌కుమార్ తెలిపారు.
డోర్నకల్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరిగిన రాష్ట్రస్థాయి 69వ ఎస్జీఎఫ్ వెయిట్ లిప్టింగ్ పోటీల్లో పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. బాలికల 44 విభాగంలో భగీత, థప్ప, అభినేశ్వరి, 48 కేజీల విభాగంలో సహస్ర, ఊహ వైజత, పవిత్ర, 53కేజీల విభాగంలో తనూశ్రీ, అర్చన, అనూష, 58 కేజీల విభాగంలో అర్చన, వర్షిత, తనూజ, 63కేజీల విభాగంలో అంజలి, నందిని, పవిత్ర, 69 కేజీల విభాగంలో హరిత, శ్రీఅక్షర, సోను, 77 కేజీల విభాగంలో సమ్యుత, సర్వేశ్వరి, హాసిని, 77 కేజీలు ప్లస్ విభాగంలో టోసినీ, కీర్తన, శ్రుతి ఎంపికయ్యారు. బాలుర 56 కేజీల విభాగంలో నందనకిశోర్, అభిషేక్, విష్ణు, 60 కేజీల్లో దీపక్, రియాజ్, అబ్దుల్ అహ్మద్, 65 కేజీల్లో సిద్దూ, వీరేశ్, రాజు, 71 కేజీల్లో ధనుష్, వినీత్, జస్పర్, 79 కేజీల్లో ముజీబ్, అర్షద్ దివాకర్, ఎంఎం జిష్ణు, 88 కేజీల్లో శరత్చంద్ర, సాయిశ్రీనాథ్, మల్లేశ్, 98 కేజీల్లో నౌషిక్, భానుప్రసాద్, పూర్ణ, 98 కేజీలు ప్లస్ విభాగంలో అభిషేక్, మోహిత్, యశ్వంత్ ఎంపికయ్యారు. ఈ నెలలో అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఈటానగర్ జరిగే జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొననున్నట్లు వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మండలోజు సుధాకర్, సెక్రటరీ కొత్త రాంబాబు, పీఈటీ రవికుమార్ తెలిపారు.