గతంలో సినిమా ప్రకటించారంటే..షూటింగ్, ట్రైలర్, సినిమా విడుదల..ఇలా ప్రతీ విషయంలో పర్ ఫెక్ట్ షెడ్యూల్ ఉండేది. కానీ ట్రెండ్ మారింది. ఇవాళ ప్రకటించిన రిలీజ్ డేట్ (Release Dates)..రేపు ఉండకపోవచ్చు. కరోనా పుణ్యమా అని ఒక్కో సినిమా మొదటి సారి ప్రకటించిన విడుదల తేదీ దాటిపోయి రెండోసారి, మూడోసారి డేట్స్ ప్రకటించే వరకు వస్తుంది. ఇప్పటికే భీమ్లా నాయక్, గని చిత్రాలు రెండు విడుదల తేదీల్లో రావొచ్చని మేకర్స్ ప్రకటించారు.
అయితే అందరూ రెండు డేట్స్ ప్రకటిస్తే..నేనేం తక్కువా అంటూ కొత్త పబ్లిసిటీ ప్లాన్ తో వచ్చేశాడు సుందరం. ఇంతకీ ఎవరనుకుంటున్నారా..? అదేనండి నాని (Nani). ఈ హీరో ప్రస్తుతం అంటే సుందరానికి (Ante Sundaraniki) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం నాని ఏకంగా ఏడు విడుదల తేదీలు ఫైనల్ చేసి ఔరా అనిపిస్తున్నాడు. మీరు రెండు తేదీలు బ్లాక్ చేస్తే..మేం ఏడు తేదీలు ఎందుకు బ్లాక్ చేయకూడదు..? అంటూ ఏప్రిల్ 22, మే 6, మే 20 లేదా 27, జూన్ 3 లేదా 10 తేదీలు అంటూ ఏడు తేదీలను విడుదల కోసం రెడీ చేసినట్టు ట్వీట్ ద్వారా చెప్పాడు నాని.
Any centre, Any day.
Ee ఆవకాయ season Sundaranide 😎Mee andariki Summer lo Chakkiligintalu everyday 😃#AnteSundaraniki hitting the screens this summer 🤘@NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @nikethbommi pic.twitter.com/Hw1vBAlRkx
— Mythri Movie Makers (@MythriOfficial) February 3, 2022
మైత్రీ మూవీ మేకర్స్ టీం ఈ ఏడు తేదీల్లో ఏదో ఒకదాన్ని ఫైనల్ చేయనుంది. అంటే సుందరానికి మార్చి నెలలోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హెలేరియస్ ఎంటర్టైనర్గా రాబోతుంది. మలయాళ భామ నజ్రియా ఫహద్ తెలుగులో తొలిసారి ఎంట్రీ ఇస్తోంది.