Unstoppable Finale Promo | నాదో చిన్న కోరిక..మహేశ్ బాబును అడిగిన బాలకృష్ణ..ప్రోమో అదిరింది
అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. షో మొదలైనప్పటి నుంచి సెలబ్రిటీలతో సరదా సంభాషణ కొనసాగిస్తూ..వారి అభిమానులకు తెలియని విషయాలను బయటకు రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు బాలయ్య.
నందమూరి హీరో బాలకృష్ణ (Balakrishna) ఫన్ టైం ఆహా షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే (UnstoppableWithNBK). షో మొదలైనప్పటి నుంచి సెలబ్రిటీలతో సరదా సంభాషణ కొనసాగిస్తూ..వారి అభిమానులకు తెలియని విషయాలను బయటకు రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు బాలయ్య. అన్ స్టాప్బుల్ ఎంటర్ టైన్ మెంట్‌తో సాగుతున్న ఈ షోకు సంబంధించి తాజాగా అన్ స్టాపబుల్ గ్రాండ్ సీజన్ ఫినాలే (Unstoppable Finale Special Promo) ఎపిసోడ్ స్పెషల్ ప్రోమోను విడుదల చేశారు. మహేశ్‌బాబు (Mahesh Babu)తో ఆద్యంతం ఫన్‌గా ఉండబోతున్నట్టు ప్రోమో ద్వారా తెలిసిపోతుంది.
ఇంత యంగ్‌గా ఉన్నావేంటయ్యా బాబు..కానీ నాదో చిన్న కోరిక నా డైలాగ్ నీ గొంతులో వినాలనుందయ్యా అంటూ బాలకృష్ణ మహేశ్‌ను అడిగే మాటలతో మొదలైంది ప్రోమో. మీ డైలాగ్ మీరు తప్ప ఇంకెవరు చెప్పలేరు సార్..అని మహేశ్ అంటున్నాడు. చిన్నపుడు నువ్వు చాలా నాటీ కిడ్‌వని విన్నాను. చేసేవన్నీ చేస్తావ్..చెప్పమంటే సిగ్గపడతావ్. నంబర్ వన్ స్టార్ అవుతూ సూపర్ స్టార్ అయిపోయావ్. సడెన్‌గా మూడేళ్లు గ్యాప్ తీసుకున్నావ్..ఏంటని అడిగాడు బాలయ్య.
దానికి ఆ మూడేళ్లు నేను కరెక్ట్ చేసుకోవడానికి తీసుకున్నానని చెప్పాడు మహేశ్. దాని తర్వాత మళ్లీ తిరిగి ఆలోచించలేదని చెప్పాడు. వెకేషన్ అని చెప్పి పెళ్లి చేసుకున్నావ్..ఏంటి అంత సీక్రెట్ అంటూ మహేశ్ గురించి రహస్యాల కూపీ లాగే ప్రయత్నం చేశాడు. మహేశ్, బాలకృష్ణ కాంబోలో ఎలాంటి ఎంటర్ టైన్ మెంట్ ఉండబోతుందో శాంపిల్ చూపిస్తూ విడుదల చేసిన ప్రోమో ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. శుక్రవారం ప్రీమియర్ కానుంది ఈ ఎపిసోడ్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

