టాలీవుడ్ హీరోలు వెంకటేశ్ (Venkatesh) , వరుణ్ తేజ్ (Varun Tej) కాంబినేషన్లో వస్తున్నమోస్ట్ క్రేజీ ప్రాజెక్టు ఎఫ్ 3 (F3 movie). ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah), మెహరీన్ కౌర్ (Mehreen Pirzada) ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్‌ను మేకర్స్ అందించారు. ఎఫ్ 3 నుంచి మొదటి సాంగ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ (Lab Dab Lab Dab Dabboo)లాంఛింగ్ డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 7న పాటను విడుదల చేయనున్నారు మేకర్స్. డబ్బు నేపథ్యంలో సాగే ఈ పాటను రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2022 ఏప్రిల్ 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. 2018లో వచ్చిన ఎఫ్ 2 సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఎఫ్2కు సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్ 3లో ఫన్ అండ్ ఫ్రస్టేషన్తోపాటు అదనంగా డబ్బు నేపథ్యాన్ని ఫన్నీ యాంగిల్ లో చూపించబోతున్నట్టు తాజా అప్ డేట్‌తో అర్థమవుతుంది. మరి వెంకీ, వరుణ్ వేసవిలో ఏ స్థాయిలో వినోదాన్ని పంచుతారో చూడాలి.