FIR Trailer | రవితేజ సమర్పణలో ‘ఎఫ్ఐఆర్’..సస్పెన్స్ గా ట్రైలర్
మను ఆనంద్ (Manu Anand) డైరెక్షన్లో కోలీవుడ్ యాక్టర్ విష్ణు విశాల్ (Vishnu Vishal) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఎఫ్ఐఆర్ (FIR). టాలీవుడ్ (Tollywood)హీరో రవితేజ (Ravi Teja) సమర్పిస్తున్నాడు.
టాలీవుడ్ (Tollywood)హీరో రవితేజ (Ravi Teja) సమర్ఫణలో వస్తున్న చిత్రం ఎఫ్ఐఆర్ (FIR). మను ఆనంద్ (Manu Anand) డైరెక్షన్లో కోలీవుడ్ యాక్టర్ విష్ణు విశాల్ (Vishnu Vishal) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ల నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు దర్శకుడు. టెర్రర్ పుట్టాలి..టెర్రరిజం పెరగాలి..దాని కోసం నాకో ఆర్మీ కావాలి..అంటూ వచ్చే సంభాషణలతో షురూ అయింది ట్రైలర్. అబూబకర్ అబ్దుల్లా మళ్లీ ఇండియాకొచ్చాడని అంటున్నారు. వాడి నెక్ట్స్ ప్లాన్ ఏంటో..? అని ఇద్దరు వ్యక్తులు చర్చించుకుండటం ట్రైలర్ లో చూడొచ్చు.
కేవలం అనుమానంతో ఒకడి జీవితాన్ని నాశనం చేస్తే ఎవడో ఒకడు తిరిగి దెబ్బకొడతాడన్న భయం పుట్టాలి..ట్రైలర్ చివరలో హీరో చెప్తున్న డైలాగ్స్ అసలు సినిమాలో ట్విస్ట్ ఏంటనే దానిపై హింట్ ఇస్తున్నాయి. హీరోను అబూబకర్‌గా అనుమానించి పోలీస్ అధికారులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయగా..ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేదానిపై సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సాగుతున్న ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది.
Unstoppable Finale Promo | నాదో చిన్న కోరిక..మహేశ్ బాబును అడిగిన బాలకృష్ణ..ప్రోమో అదిరింది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

