హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పోలీసులు తనపై ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే అక్రమంగా నిర్బంధించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ న్యాయవాది విజయ్‌పాల్ కింది కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఆ కోర్టు ఆదేశాల మేరకు తమపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ పోలీసులు రూపావత్ పవన్, నామిండ్ల శంకర్ హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్ తుకారాంజీ.. ఆ ఇద్దరు పోలీసుల పిటిషన్లను డిస్మిస్ చేశారు. వారిపై వచ్చిన అభియోగాల్లో వాస్తవాలేమిటో దర్యాప్తులో తేలాల్సి ఉన్నందున ప్రస్తుత దశ లో జోక్యం చేసుకోలేమని వెల్లడించారు.