నైటింగేల్ సేవలను ఆదర్శంగా తీసుకోండి
ప్రపంచ నర్సింగ్ రంగానికి మార్గదర్శకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను ఆదర్శంగా తీసుకుని నర్సింగ్ ఆఫీసర్లు పనిచేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దా మోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు.
- నర్సింగ్ ఆఫీసర్లకు మంత్రి దామోదర రాజనరసింహ పిలుపు
- 1919 మందికి నియామక పత్రాల అందజేసిన మంత్రి
- జూన్‌లో సనత్‌నగర్‌లోని టిమ్స్ ప్రారంభిస్తామని వెల్లడి
హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ప్రపంచ నర్సింగ్ రంగానికి మార్గదర్శకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను ఆదర్శంగా తీసుకుని నర్సింగ్ ఆఫీసర్లు పనిచేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దా మోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్లో ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు పొందిన 1919మంది నర్సింగ్ ఆఫీసర్లకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు.
నర్సింగ్ అనేది కేవలం వృత్తి మాత్రమే కాదని, మానవత్వాన్ని చాటే గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో నర్సులు అందించిన సేవలు మరువలేనివని కొనియాడా రు. రాష్ట్రంలో దాదాపు లక్షా 80 వేల రిజిస్టర్డ్ నర్సులు సేవలందిస్తున్నారని వెల్లడించారు.
నర్సుల వృత్తి పరమైన అభివృద్ధి కోసం ప్రత్యేక నర్సింగ్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 3 మిడ్ వైఫరీ ట్రైనింగ్ కళాశాలలు ఉన్నాయని, దశలవారీగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలకు మిడ్ వైఫరీ ట్రైనింగ్ కోర్సు ను అందుబాటులోకి తీసుకొస్తామని తె లిపారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మీర్జా రహ్మత్ బేగ్, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్త్తూ పాల్గొన్నారు.
టిమ్స్‌లో వైద్యసేవల ట్రయల్ రన్
జూన్‌లో సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తామని మంత్రి రాజనర్సింహ తెలిపారు. సనత్‌నగర్ టిమ్స్‌లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్‌ను పరిశీలించిన అనంతరం ఆర్అండ్బీ, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడారు. పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వెయ్యి బెడ్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ హాస్పిటల్లో 300 ఎమర్జెన్సీ బెడ్లు ఉంటాయని వెల్లడించారు.
నీట్ నిర్వహణలో ఎన్టీఏ విఫలం
నీట్ పరీక్ష నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విఫలమైందని మంత్రి దామోదర మండిపడ్డారు. రాష్ట్రంలో 70 వేల మంది, దేశ వ్యాప్తంగా 22 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్ రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారని గుర్తు చేశారు. ఎన్టీఏ నిర్లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరంగా పరిణమించిందన్నారు. కేంద్రం సరైన రీతిలో స్పందించి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

