నేటి కుర్రకారు హెల్తీఫుడ్ అంటూ.. మన వంటింట్లో ఉండే అద్భుతమైన సహజ పదార్థాలను పట్టించుకోకుండా ఖరీదైన సప్లిమెంట్ల వైపు పరుగులు తీస్తున్నారు. వంటింట్లో ఉన్న ఒక్కో దినుసు.. నాలుగైదుకు తక్కువ కాకుండా ప్రయోజనాలను అందిస్తుంది. గసగసాలు ఆ కోవకే చెందుతాయి. శరీరానికి తక్షణ శక్తిని అందించి, నీరసాన్ని తరిమికొట్టడంలో ఇవి దోహదపడతాయి. గసగసాలు రుచి కోసం ఉపయోగించే దినుసులు మాత్రమే కావు.. అవి ఒక అద్భుతమైన ఔషధాల గనులు. వీటిలో క్యాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. నేటి ఆధునిక జీవన శైలిలో సరిగా నిద్రపట్టని వారికి, నీరసం, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి గసగసాలు సంజీవనిలా పనిచేస్తాయని రీసెర్చ్ గేట్ అధ్యయనం పేరొంది.