ఈ రోజుల్లో అందరి ఇండ్లల్లో రిఫ్రిజిరేటర్లు ఉంటున్నాయి. ఏండ్లుగా వాడుతున్నా.. ఫ్రిజ్ నిర్వహణలో చాలామంది పట్టు సాధించలేక పోతున్నారు. ఎన్నో సౌకర్యాలను అందించే ఫ్రిజ్‌ను జాగ్రత్తగా నిర్వహించకపోతే సమస్యలు తప్పవు. అధిక వేడి, వోల్టేజ్ సమస్యలు, నిర్వహణ లోపాల వల్ల ఫ్రిజ్ ఒక బాంబులా మారే ప్రమాదం ఉంది. మీ ఇంట్లోని ఫ్రిజ్ సురక్షితంగా ఉండాలంటే మీరు చేస్తున్న ఈ చిన్నచిన్న పొరపాట్లను తక్షణమే సరిదిద్దుకోవాలి.
తకువగా ఉందని ఫ్రిజ్‌ను గోడకు అతుకుపోయేలా పెడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఫ్రిజ్ వెనుక భాగంలో ఉండే కంప్రెసర్ పని చేస్తున్నప్పుడు అధిక వేడిని విడుదల చేస్తుంది. ఫ్రిజ్‌కు, గోడకు మధ్య తగినంత ఖాళీ లేకపోతే ఆ వేడి బయటికి వెళ్లదు. దీనివల్ల కంప్రెసర్ మరింత వేడెకి పేలిపోయే అవకాశం ఉంది. ఫ్రిజ్‌కు, గోడకు మధ్య కనీసం 5 నుంచి 7 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి.
స్టెబిలైజర్ లేకపోవడం : వేసవిలో విద్యుత్ వినియోగం పెరగడం వల్ల పవర్ కట్స్, వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఎకువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో నేరుగా ప్లగ్ పాయింట్ నుంచి ఫ్రిజ్‌ను నడిపించడం రిస్తో కూడుకున్న పని. వోల్టేజ్ ఒకసారిగా పెరిగినప్పుడు కంప్రెసర్ మీద లోడ్ పడి షార్ట్ సర్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే నాణ్యమైన స్టెబిలైజర్‌ను తప్పనిసరిగా వాడాలి. ఇది వోల్టేజ్ ను నియంత్రించి షార్ట్ సర్క్యూట్ నుంచి కాపాడుతుంది.
సరైన వైరింగ్ : చలికాలంలో చాలామంది ఫ్రిజ్ వాడకాన్ని మానేసి, ఎండలు రాగానే వైరింగ్‌ను పరిశీలించకుండానే ఒక్కసారిగా దాన్ని ఆన్ చేస్తారు. వైరింగ్ సరిగ్గా లేకపోతే నిప్పు రవ్వలు వచ్చి ఫ్రిజ్‌కు నిప్పు అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే వాడకం మొదలుపెట్టే ముందు వైరింగ్‌ను ఒకసారి తనిఖీ చేయడం ఉత్తమం.
తగ్గించకండి : వస్తువులు త్వరగా చల్లబడాలని చాలామంది ఫ్రిజ్ థర్మోస్టాట్‌ను అత్యంత తకువ ఉష్ణోగ్రతకు సెట్ చేస్తారు. బయట ఎండలు ఎకువగా ఉన్నప్పుడు ఇలా చేయడం వల్ల కంప్రెసర్ నిరంతరం పని చేయాల్సి వస్తుంది. దీనివల్ల దానిపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. పాత ఫ్రిజ్ ఉన్నవారు ఉష్ణోగ్రతను మరీ తకువగా ఉంచకుండా, సాధారణ స్థాయిలో ఉంచడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.
మంచును కరిగించండి : ఫ్రీజర్‌లో మంచు విపరీతంగా పేరుకుపోతున్నా… చాలామంది పట్టించుకోరు. గడ్డకట్టిన మంచు కూలింగ్ సిస్టమ్‌పై ఒత్తిడి పెంచుతుంది. ఇది కంప్రెసర్ మీద నేరుగా ప్రభావం చూపుతుంది. వేసవిలో బయటి వాతావరణం వేడిగా ఉండటం వల్ల ఈ ఒత్తిడి రెట్టింపు అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు డీఫ్రాస్ట్ బటన్ నొకి మంచును కరిగించాలి. అలాగే, ఫ్రిజ్ తలుపును పదేపదే తీయడం, ఎకువ సేపు తెరిచి ఉంచడం వల్ల లోపలి కూలింగ్ తగ్గి, కంప్రెసర్ మళ్లీ మళ్లీ స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. దీనివల్ల విద్యుత్ బిల్లు పెరగడమే కాకుండా కంప్రెసర్ లైఫ్ కూడా తగ్గుతుంది.