Mohammad Shami : ఒకప్పుడు ప్రధాన పేసర్‌గా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన మహ్మద్ షమీ (Mohammad Shami) ఇప్పుడు చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. మునపటి పేస్ పవర్ తగ్గడంతో అతడిని తీసుకునేందుకు సెలెక్టర్లు ఆసక్తి చూపించడం లేదు. ఐపీఎల్ 18వ సీజన్లో ఇంగ్లండ్ పర్యటన (England Tour)కు దూరమైన ఈ పేసర్ ఫామ్ చాటుకునేందుకు సిద్దమవుతున్నాడు. దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శనతో పునరాగమనం చేయాలని అనుకుంటున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న దేశవాళీ సీజన్లో ఈ స్పీడ్‌స్టర్ బెంగాల్ తరఫున బరిలోకి దిగనున్నాడు.
శనివారం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ 50 మంది ప్రాబబుల్స్‌ను ప్రకటించింది. ఇందులో షమీతో పాటు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పేసర్ ఆకాశ్ దీ(Akash Deep), బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్‌లు కూడా ఉన్నారు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున అదరగొడుతున్న కుర్రాడు అభిషేక్ పొరెల్ సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
After missing spot in India’s squad for England tour, Mohammed Shami set to make cricketing comeback: Check details#MohammedShami https://t.co/VbinZguhmk
— Sports Tak (@sports_tak) July 19, 2025
కమ్‌బ్యాక్ చేయడం ఏ క్రికెటర్‌కైనా కష్టమే. ఇప్పుడు షమీ అలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 అనంతరం గాయం కారణంగా జట్టుకు దూరమైన షమీ.. ఏడాది తర్వాత ఎంట్రీ ఇచ్చాడు. దేశవాళీలో రెండు మ్యాచుల్లో సత్తా చాటిన అతడు ఐపీఎల్ 18వ సీజన్లో సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad)కు ప్రాతినిధ్యం వహించాడు.
కానీ, ఈ పేస్ గన్ ఈ మెగా టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేదు. ఆరెంజ్ ఆర్మీని తీవ్రంగా నిరాశపరుస్తూ 9 మ్యాచుల్లో కేవలం ఆరు వికెట్లు తీశాడంతే. మునపటిలా రాణించలేకపోవడంతో ఇంగ్లండ్ టూర్‌కు అతడిని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. సో.. ఇక ఉన్నదారి దేశవాళీలో వికెట్ల వేటతో అందరి దృష్టిని ఆకర్షించడమే. డొమెస్టిక్ సీజన్ 2025-26 ఆగస్టులో మొదలవ్వనుంది.
బెంగాల్ ప్రాబబుల్స్ : అభిమన్యు ఈశ్వరన్, షమీ, అనుస్తుప్ మజుందార్ సుదీప్ ముఖర్జీ, సుదీప్ కుమార్, అభిషేక్ పొరెల్(వికెట్ కీపర్), షకిర్ హబిబ్ గాంధీ (వికెట్ కీపర్), కజీ జునైద్ సైఫీ, షహబాజ్ అహ్మద్, ప్రదీప్త ప్రమాణిక్, వ్రిత్తిక్ ఛటర్జీ, కరన్ లాల్, ఆకాశ్ దీప్ ముకేశ్ కుమార్ సింధు జైస్వాల్, ఇషాన్ పొరెల్, మహ్మద్ కైఫ్ శుభమ్ ఛటర్జీ, సుమంత గుప్త.. తదితరులు ఉన్నారు.