Hari Hara Veera Mallu Ticket Rates Hike | స్టార్ నటుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ చిత్రం జులై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండగా.. సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజుల వరకు రేట్లు పెంచడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. మొదట రెండు వారాలు రేట్లు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరగా.. ప్రభుత్వం తిరస్కరిస్తూ.. 10 రోజుల వరకే అవకాశం ఇచ్చింది. ఇక పెంచిన రేట్లను బట్టి చూసుకుంటే.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై లోయర్ క్లాస్‌కి రూ.100 అప్పర్ క్లాస్‌కి రూ.150 పెంచుకునే అవకాశం కల్పించారు. మల్టీప్లెక్స్‌లలో అయితే రూ.200 వరకు పెంచుకోవడానికి అనుమతి లభించింది. మరోవైపు టికెట్ ధరలను పెంచాలంటూ చిత్రబృందం తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. ఏఎం రత్నం నిర్మించారు.