TGSRTC | మారేడ్‌పల్లి, జూలై 19: తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ఆర్టీసీ) సికింద్రాబాద్ రీజియన్ పరిధిలోని 11 డిపోలలో గ్యారేజ్ ఆపరేషన్, కార్యాలయ విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రాంతీయ అధికారి ఎన్. సుచరిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, డిప్లొమా (మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్), నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ (బీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ) కోర్సులు 2021 సంవత్సరం తర్వాత పూర్తిచేసిన అభ్యర్థులు అప్రెంటిస్‌షిప్‌కి అర్హులని చెప్పారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 29లోపు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) వెబ్‌పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. అప్రెంటిస్‌షిప్ కాలవ్యవధి మూడు సంవత్సరాలు ఉంటుందని, అభ్యర్థులకు నెలసరి ఉపకార వేతనాలు అందించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 83411 46299, 93912 89254, 99592 26125 నెంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.