Encounter | శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో శనివారం రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరణించిన ఉగ్రవాదుల్లో విదేశీయుడొకరు ఉన్నారు. విదేశీ ఉగ్రవాదిని లష్కరే తాయిబా టాప్ కమాండర్ ఉస్మాన్‌గా గుర్తించినట్టు కశ్మీర్ జోన్ ఐజీపీ విద్ది కుమార్ బర్డీ తెలిపారు. 2023లో జరిగిన ఇన్స్పెక్టర్ మస్రూర్ హత్య కేసుతో అతడికి సంబంధం ఉందని చెప్పారు. కాగా, శ్రీనగర్ సమీపంలోని ఖన్యర్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.