సీజనల్ వ్యాధులు రాకుండా..ఇవి తినండి..!

హైదరాబాద్,జూన్ 25: సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉండాలంటేఎప్పటికప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో శరీరానికి తగిన రోగనిరోధక శక్తిని అందించే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పోషకాలు అధికంగా ఉండే కొన్ని ఆహారపదార్థాలు రోగనిరోధకశక్తిని బలోపేతం చేయడంలో సాయపడతాయి. వర్షాకాలంలో తినాల్సిన ఆహారపదార్థాల గురించి అనుసరించాల్సిన నియమాలను గురించి చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అవేంటంటే..
ఆరోగ్యకరమైన ఆహారం,వ్యాయామం,యోగా,ధ్యానం,సంగీతం వినడం ఇవన్నీ ఒత్తిడి తగ్గించే కారకాలు. వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు ఆహారంలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. వాతావరణ పరిస్థితులలో విపరీతమైన మార్పు మన జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఇది అంటువ్యాధుల బారిన పడేలా చేస్తుంది అని గుర్తుంచుకోవాలి. పోషకాలు అధికంగా ఉండే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

సీజనల్ ఫ్రూట్స్ …
వర్ష రుతువులో వచ్చే పండ్లు లిచీ, బొప్పాయి, దానిమ్మ, బేరి వంటివి ఆహారాన్ని జీర్ణించుకోవటానికి శరీరానికి సహాయపడటమే కాకుండా, తేమ స్థాయి పెరగడం వల్ల కలిగే అంటువ్యాధులపై పోరాడటానికి కూడా సహాయపడతాయి. ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి, ఇవి రక్తపోటును తగ్గించడానికి, వివిధ ఇన్ఫెక్షన్లను నివారించడానికి సహాయపడతాయి. నేరేడు పండ్లు ఈ కాలంలో విరివిగా దొరికే పండ్లు. వీటిలో ఐరన్,ఫోలేట్,పొటాషియం,విటమిన్లు అధికంగా ఉంటాయి.
అరటిపండ్లు…
వర్షాకాలంలో జీర్ణ సంబంధిత అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అరటి దీనికి ఉత్తమ రక్షణ. అరటిలో జీర్ణక్రియకు తోడ్పడే విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. వాటిలో ఆస్కార్బిక్ ఆమ్లం (విటమిన్ సి),రెటినాల్ కూడా ఉన్నాయి, ఇవి మన శరీర రోగనిరోధక శక్తిని అధికంగా ఉంచడంలో సహాయపడతాయి. అరటిపండ్లు తక్కువ కేలరీలను కలిగి ఉండి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండటానికి సహాయపడతాయి.
మొక్కజొన్న…
మొక్కజొన్న ఆరోగ్యకరమైన ఆహారం ఎందుకంటే దీనిలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో లుటిన్,ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
గుడ్లు…
అన్ని సీజన్స్‌లోనూ ఉపయోగించే బెస్ట్ ఫుడ్. గుడ్డులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. గుడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.
కొబ్బరి నీళ్లు…
శరీరం హైడ్రేటెడ్‌గా ఉంచటానికి మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి కొబ్బరి నీరు ఉత్తమమైన మార్గాలలో ఒకటి. కొబ్బరి నీరుశరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించడానికి సహాయపడుతుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చర్మం,గుండె ఆరోగ్యానికి అద్భుతంగా పని చేస్తుంది.బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది ఉత్తమ ఎంపిక.శరీరంలో విటమిన్ “సి” స్థాయిలనిపెంచడానికి కొబ్బరి నీళ్ళలో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

