దామరచర్ల, ఏప్రిల్ 15 : యూత్ ఫర్ సేవా నల్లగొండ చాప్టర్ ఆధ్వర్యంలో దామరచర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం స్కూల్ కిట్ డ్రైవ్ నిర్వహించారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, ఒక సంవత్సరానికి సరిపడా నోట్ బుక్స్, అభ్యాసన సామగ్రిని అందించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బి.సీతామహాలక్ష్మి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్ధులు తమ లక్ష్యాలను సాధించడానికి ఇష్టంతో కష్టపడి చదువుకోవాలని, యూత్ ఫర్ సేవ ద్వారా ఇచ్చిన బ్యాగ్, పుస్తకాలని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని చెప్పారు.
అనంతరం పాఠశాల హెడ్ మాస్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి సొంత గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. యూత్ ఫర్ సేవ నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ నాగేంద్ర చారి మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం నుండి ల్యాబ్ ఆన్ వీల్స్ ద్వారా ప్రతి వారం సైన్స్ తరగతుల ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామన్నారు. యూత్ ఫర్ సేవా భారతదేశం అంతటా విద్యా , వైద్యం, నైపుణ్య శిక్షణ, పర్యావరణ అంశాలపై నిర్వహిస్తున్న వివిధ సేవ కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు.