Patlolla Karthik Reddy | హైదరాబాద్ : నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) రూపంలో ఒక పెద్ద విపత్తు దక్షిణ భారతదేశం వైపు దూసుకు వస్తుందని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. డీలిమిటేషన్ విషయంపై ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. భారత యూనియన్‌లో దక్షిణ భారతదేశం ఒక గొప్ప భాగస్వామిగా ఉంది.. కానీ దక్షిణ భారతదేశం ఎప్పుడూ ఇచ్చేవారి పక్షానే ఉంది తప్ప, తీసుకునేవారి పక్షాన ఎప్పుడూ లేదన్నారు. ఇప్పుడు దక్షిణ భారతదేశానికి కూడా భారత యూనియన్ అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. ఈ దేశంలోని ప్రతి భారతీయుడితో సమానంగా దక్షిణ భారతదేశం, మనం కూడా సమాన భాగమేనని నిరూపించాలని.. ప్రతీతి దక్షిణ భారతీయుడు ఏకం కావాలని కోరారు.
ఇది ఇప్పుడే కావాలి లేదంటే ఇంకెప్పుడూ కాదు. మనమందరం ఒక్కటి కావాల్సిన సమయం వచ్చింది. మీ కులాన్ని, మీ మతాన్ని, మీ ప్రాంతాన్ని పక్కన పెట్టి, అందరూ కలిసికట్టుగా మీ సంఘీభావాన్ని తెలియజేయండి. మీ గళాన్ని పార్లమెంటుకు చేరేంత గట్టిగా వినిపించాలి. ఈ సారి మనం చాలా సీరియస్‌గా ఉన్నామని వారు అర్థం చేసుకుంటారు. బీజేపీ కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని నేను కోరుతున్నానన్నారు.
దక్షిణ భారతదేశంలోని అన్ని భాగస్వామ్య రాష్ట్రాలతో సంప్రదించకుండా లేదా వారి అంగీకారం లేకుండా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, అది విచ్ఛిన్నతకు దారితీస్తుంది. ఆ విచ్ఛిన్నత భౌతికంగా ఉండకపోవచ్చు. అది మానసిక విచ్ఛిన్నం కావచ్చునని.. దానివల్ల దక్షిణ భారతీయులమైన తమ మనసు తీవ్రంగా గాయపడుతుందని.. తాము అవమానానికి గురవుతామన్నారు కార్తీక్‌రెడ్డి.
మేము రెండవ తరగతి పౌరులమనే భావన ఈ దేశంలోదేనికైనా దారితీయవచ్చు. జనాభా ప్రాతిపదికన ఈ నియోజకవర్గాల పునర్విభజనను తిరస్కరించాలని ప్రధానమంత్రిని, బీజేపీని, దక్షిణ భారతదేశంలోని ఎన్డీఏ మిత్రపక్షాలను కోరుతున్నా. జనాభా ప్రాతిపదికన పునర్విభజన అనే ఆలోచనను తిరస్కరించి, అందరూ ఏకాభిప్రాయానికి రావాలి.. సంప్రదింపులు జరగాలన్నారు.
#WATCH | Hyderabad, Telangana: On delimitation, BRS leader Karthik Reddy Patlolla says, “A huge catastrophe in the form of delimitation is stumbling towards South India. South India has been a great partner in the Union of India… But South India has always been on the side of a… pic.twitter.com/JXznVHYwc0
— ANI (@ANI) April 15, 2026