కరీంనగర్ కమాన్‌చౌరస్తా, నవంబర్ 2 : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం అందించేందుకే స్కాలర్షిప్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య ఇంటర్ విద్యాసంస్థల ఐఐటీ, నీట్ అకాడమీ ఆధ్యర్యంలో పదో తగరతి విద్యార్థులకు సాలర్షిప్ టాలెంట్ టెస్ట్-2025ను ఆదివారం నిర్వహించారు. 12,519 మంది విద్యార్థులు నమోదు చేసుకుని పరీక్షకు హాజరవగా, శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన పది కళాశాలల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షకు ఉత్తర తెలంగాణలోని 12 వేలకు పైగా విద్యార్థులు హాజరవడంపై సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రోత్సాహించిన తల్లిదండ్రులకు, పాఠశాల కరస్పాండెంట్లకు, అధ్యాపకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతిభ ఉండి, ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు ఉచిత, రాయితీతో ఐఐటీ-జేఈఈ మేయిన్స్, నీట్, ఎప్‌సెట్ శిక్షణతో ఇంటర్ విద్యను కార్పొరేట్ స్థాయిలో అందించాలని ఈ టెస్ట్ నిర్వహించామని తెలిపారు. ప్రతిభ, మారుల ఆధారంగా వంద శాతం ఉచిత విద్య అందిస్తామన్నారు. మొదటి బహుమతి ల్యాప్‌టాప్ రెండు నుంచి 10 వరకు బహుమతులకు టాబ్స్, రివార్డులు అందజేస్తామన్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థులందరికి కూపన్లను అందజేసి, లకీడ్రాలో మొదటి మూడు కూపన్లకు టీవీ, సైకిల్, సెల్‌ఫోన్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్యల విద్యాసంస్థల డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, డీన్ జగన్మోహన్రెడ్డి, శ్రీచైతన్య కళాశాలల ప్రిన్సిపాల్స్, ఏజీఎం, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.