Satyavati Rathod | కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేవరకు చెప్పులు వేసుకోనని దీక్ష పట్టిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్న మీద నిలబడింది. తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో సత్యవతి రాథోడ్ పాల్గొని కిలోమీటర్ల దూరం చెప్పులు లేకుండానే నడిచింది. కేసీఆర్ మరోసారి సీఎం అయ్యేంత వరకు చెప్పులు వేసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
కాగా, పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రకు ప్రజలు, ఆయన అభిమానులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. తమ అభిమాన నాయకుడిని కడచూపు కోసం చుట్ట పక్కల గ్రామాల నుంచి ప్రజలు దండులా తరలివస్తున్నారు. మరో వైపు అంత్యక్రియల్లో పాల్గొనడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లికి చేరుకున్నారు.
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేవరకు చెప్పులు వేసుకోనని దీక్ష పట్టిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో కిలోమీటర్ల దూరం చెప్పులు లేకుండానే నడుస్తున్న సత్యవతి రాథోడ్ https://t.co/rPkNITh3jj pic.twitter.com/iquwA1PLRF
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2026