హైదరాబాద్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లుగా ఎన్నికైనవారు ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌తోపాటు గ్రామపంచాయతీ పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం తాజాగా గెజిట్ విడుదల చేసింది.
అదేరోజు గ్రామపంచాయతీల తొలి పాలకవర్గ సమావేశం నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ సృజన ఆదేశాల్లో పేర్కొన్నారు. తొలి విడత 11న, మలి విడత 14న పంచాయతీ ఎన్నికలు పూర్తవగా, తుది విడత 17న జరగనున్నాయి.