Sankara Nethralaya | గ్రామీణుల కంటిలో వెలుగు నింపే లక్ష్యంతో శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో ‘అడాప్ట్-ఎ-విలేజ్’ దాతల సమ్మేళనం అమెరికాలో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామీణ భారతదేశంలో నిర్వహించిన MESU మొబైల్ కంటి శిబిరాల ఫలితాలను సమీక్షించారు. ఈ శిబిరాల ద్వారా 48 సంవత్సరాలుగా శంకర నేత్రాలయ గ్రామీణ ప్రజల కంటి వెలుగు పునరుద్ధరిస్తూ సేవా దీప్తిని వెలిగిస్తోంది.
ప్రధాన అతిథి గణపతి రెడ్డి ఇందుర్తి (తెలంగాణ విద్యా శాఖ మేనేజింగ్ డైరెక్టర్, మాజీ R&B చీఫ్) MESU అనుమతులు, లాజిస్టిక్స్ సమన్వయంలో విశేష పాత్ర పోషించారు. దిండి చింతపల్లి, కొండా రెడ్డి పల్లి సహా ఆరు శిబిరాలకు స్వయంగా హాజరై పర్యవేక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కృష్ణారెడ్డి కొండారెడ్డి పల్లిలో నిర్వహించిన 20వ MESU శిబిరంలో 1,800 మందికి eyesight సేవలు అందించారు.
రాఘవేంద్ర రెడ్డి సుంకిరెడ్డి (హూస్టన్ రియల్టర్ & TASK COO) మూడు శిబిరాలకు స్పాన్సర్ చేస్తూ, గ్రామాల్లో శస్త్రచికిత్సల ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూశారు. రాజు బైరమ్ మరియు డాక్టర్ అలెక్స్ అందించిన సేవలను ప్రశంసించారు. మారేపల్లి చంద్రశేఖర్ రెడ్డి (సాన్ డియాగో) కన్నెకల్ శిబిరానికి మద్దతు ఇస్తూ, “స్థానిక భాగస్వామ్యం విజయానికి మూలం” అని స్పష్టం చేశారు. జలంధర్ రెడ్డి నల్లమల గిరిజన ప్రాంతాలలో 1,163 స్క్రీనింగ్‌లు, 182 శస్త్రచికిత్సలు నిర్వహించిన శిబిరాలను ముందుండి నడిపించారు.
Sankaranethralaya1
డాక్టర్ శరత్ కామినేని రెండు శిబిరాలకు మద్దతు ఇస్తూ “MESU సేవలు నా జీవితానికి కొత్త అర్థం ఇచ్చాయి” అన్నారు. శ్రీని రెడ్డి వంగిమల్ల మూడు శిబిరాలను విజయవంతంగా నిర్వహించి, శస్త్రచికిత్సల అనంతరం సంతోషంగా కన్నీరు పెట్టుకున్న రోగుల అనుభవాలను అందరికీ వివరించారు. తిరుమల రెడ్డి కంభం, డాక్టర్ NRU, సత్యం వీర్నపు బలమైన కుటుంబ సమన్వయంతో రెండవ MESU శిబిరం విజయవంతం చేశారు.
డాక్టర్ లక్ష్మణ్ రావు కల్వకుంట్ల హైదరాబాద్‌లో శాశ్వత బేస్ ఆసుపత్రి అవసరాన్ని ప్రతిపాదించారు. కిరణ్ రెడ్డి పాశం ఖుదబక్షపల్లి శిబిరంలో 77 శస్త్రచికిత్సలు నిర్వహించి తన తండ్రి ధర్మారెడ్డి జ్ఞాపకార్థం సేవ చేశారు. శ్రీనివాస్ ఈమాని, జగదీష్ చీమర్ల, భాస్కర్ గంగిపాముల, మెహర్ & విజయ లంక, లోకేష్ కృష్ణస్వామి తమ స్వగ్రామాల్లో మెసూ శిబిరాలు నిర్వహించి “నూతన దృష్టి – నూతన జీవితం” అనే సందేశాన్ని ప్రజల హృదయాల్లో నింపారు.
Sankaranethralaya2
వినోద్ పర్ణ, సూర్య గంగిరెడ్డి, రామ్ కొట్టి, సతీష్ కుమార్, డాక్టర్ రెడ్డి ఊరిమిండి, మల్లిక్ బండా, రత్నకుమార్ కవుటూరి గ్లోబల్ స్థాయిలో శంకర నేత్రాలయ సేవా మిషన్‌ను విస్తరించడంలో పునాదులు వేశారు. రాజు బైరం, ఉజ్వల్ సిన్హా, కౌశిక్, రంజిత్ కుమార్, భాను ప్రకాష్ రెడ్డి, అరుల్ కుమార్, సురేష్ కుమార్, డాక్టర్ గిరీష్ రావు, డాక్టర్ టి సురేంద్రన్ వంటి మెసూ బృందాల కృషితో ఈ గ్రామాల కంటి వెలుగు పునరుద్ధరించబడుతోంది.
అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి మాట్లాడుతూ.. “అడాప్ట్-ఎ-విలేజ్ కేవలం సేవ కాదు – అది మానవత్వానికి అందిస్తున్న శాశ్వత దృష్ఠి దీపం” అని పేర్కొన్నారు.