దీపావళి సందర్భంగా’అర్చన ఫైన్ ఆర్ట్స్- అమెరికా’, ‘శ్రీ శారద సత్యనారాయణ ట్రస్ట్ – హ్యూస్టన్, అమెరికా’ సంస్థలు సంయుక్తంగా ‘సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు’ప్రదానం చేశాయి. సంస్థల నిర్వాహకులు ‘నాట్యభారతి’ కోసూరి ఉమాభారతి, ప్రమీల సూర్యదేవర కలిసి ఈ అవార్డులను అందజేశారు.
సంగీత, సాహిత్య, నాటక రంగాలలో బహుముఖ ప్రజ్ఞాధురీణులు రామాయణం ప్రసాద రావు; కథా చైతన్య స్రవంతిగా తన కథల ద్వారా మనుషుల్లో చైతన్యాన్ని నింపిన డి.కామేశ్వరి; కథలు, కవితలు, చిత్రాలతో సృజనాత్మక లోకానికి మరింత అందంగా సొబగులద్దిన మన్నెం శారద; బహుముఖ ప్రజ్ఞాధురీణులు మరియు దూరదర్శన్ వ్యాఖ్యాతగా అందరి హృదయాలలో నిలిచిన ఓలేటి పార్వతీశంకు సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. అకాడమీ తరఫున హైదరాబాద్లో జ్యోతి వలబోజు నేతృత్వంలో రచయిత్రుల బృందం పురస్కార గ్రహీతల స్వగృహాలలోనే వారిని గౌరవప్రదంగా సత్కరించి పురస్కారాలని అందజేశారు.
సాహిత్య కళారంగాలలో పలువురు ప్రముఖులు ఈ పురస్కార ప్రదానంపై హర్షం వ్యక్తం చేస్తూ పురస్కార గ్రహీతలను నిర్వాహకులను అభినందించారు.
Jeevana Safalya Puraskaral3
భారతదేశ ప్రతిభకు అమెరికా నుంచి సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు