లండన్ : తెలంగాణలో కాంగ్రెస్ 22 నెలల అరాచక పాలనను నిరసిస్తూ లండన్‌లోని టావోస్టిక్ స్క్వేర్ గాంధీ విగ్రహం వద్ద ఎన్నారై బీఆర్ఎస్ యూకే (BRS UK NRIs) ఆధ్వర్యంలో శాంతియుత నిరసనను( Protest ) చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం( Anil Kurmachalam ), యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి( Naveen Reddy) ఆధ్వర్యంలో గాంధీ జీ విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. వివిధ ప్లకార్డుల ను ప్రదర్శించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ నినాదాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను, తెలంగాణ రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శించారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణలో వికాసం జరిగితే కాంగ్రెస్ అరాచక పాలనలో విధ్వంసం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎన్నో పెట్టుబడులతో పరుగులు పెట్టిందని, నేడు పెట్టుబడుల ఊసే లేదని ఆరోపించారు. లక్షల్లో అప్పులు చేసి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని పేర్కొన్నారు, హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్‌ను నాశనం చేశారని ఆరోపించారు.
ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ అవినీతి పాలనతో అన్ని రంగాల్లో వెనక్కి వెళ్తుతుందని విమర్శించారు. ఉపాధ్యక్షుడు హరి గౌడ్ నవాపేట్ మాట్లాడుతూ మరోసారి తెలంగాణలో కేసీఆర్ నాయకత్వం వస్తేనే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారని తెలిపారు. ఉపాధ్యక్షుడు సత్య మూర్తి చిలుముల మాట్లాడుతూ రానున్న ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలని కోరారు.
ఉపాధ్యక్షుడు రవి రేతినేని మాట్లాడుతూ తెలంగాణలో అప్రజాస్వామిక పాలన నడుస్తుందని, ప్రశ్నించే గొంతుని నొక్కేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అడ్వయిజరీ బోర్డు వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల , కార్యదర్శులు మల్లా రెడ్డి, సురేష్ గోపతి, అబ్దుల్ జాఫర్, రవి ప్రదీప్ పులుసు, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, యూత్ వింగ్ కార్యదర్శి ప్రశాంత్ మామిడాల, సోషల్ మీడియా కన్వీనర్ అంజన్ రావు, ఈవెంట్స్ ఇన్చార్జి తరుణ్ లునావత్ , సభ్యులు షేక్ ఇమాం గౌస్, హరి కృష్ణ మామిళ్ల, మొహ్మద్ అబ్దుల్ ఖుద్దూస్, దయాల వసంత్ కుమార్ , మహేందర్ పడిగెల, శ్యామ్ రెడ్డి సరికొండ, నాగరాజు, అజయ్ రావు, హర్షవర్ధన్ రెడ్డి, సంతోష్, సాయి కిరణ్ , హనీఫ్, తదితరులు పాల్గొన్నారు.