Shirdi | ముంబై, మార్చి 30 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని షిర్డీలో కొలువైన సాయిబాబా దర్శనం కోసం వచ్చే భక్తులకు ఐదు లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించాలని సాయి సంస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఈ బీమా రక్షణను పొందాలనుకొనేవారు దర్శనానికి వచ్చే ముందు సాయి సంస్థాన్ అధికారిక వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష్ గాడిలర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకొంటే సాయిబాబా దర్శనం కోసం మాత్రమే వారు వస్తున్నట్లు గుర్తించడానికి సహాయపడుతుందని ఆయన చెప్పారు.