నేటితో రైతుబంధు సాయం పంపిణీ పూర్తి
రైతుబంధు | రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వానాకాలం సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా అన్నదాతల ఖాతాల్లో జమవుతోంది.

హైదరాబాద్ : రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వానాకాలం సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా అన్నదాతల ఖాతాల్లో జమవుతోంది. నేటితో రైతుబంధు సాయం పంపిణీ కార్యక్రమం పూర్తి కానుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 63.25 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించింది. గత ఏడాదితో పోల్చితే 2,81,865 మంది కొత్త రైతులను లబ్ధిదారుల జాబితాలో చేర్చింది.
గురువారం వరకు 30 ఎకరాల లోపు ఉన్న వారందరికీ రైతుబంధు సాయం అందగా.. 30 ఎకరాలకు పైబడి ఉన్నవారందరికీ చివరి రోజైన శుక్రవారం ఖాతాల్లో జమ చేయనుంది. ఇప్పటి వరకు కోటి 45లక్షల 98వేల ఎకరాలకు సంబంధించి.. 60,74,973 మంది రైతుల ఖాతాల్లో రూ.7,298 కోట్లు జమయ్యాయి. పెట్టుబడిన సాయం పంపిణీ ఈ నెల 15న ప్రారంభమైంది. మొదట తొలిరోజు ఒక ఎకరం ఉన్న రైతుల ఖాతాల్లో నగదు సాయం జమ చేసింది. ఆ తర్వాత విడుదల వారీగా భూముల విస్తీర్ణం బట్టి ఆయా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ వస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఈ వేళలో వ్యాయామం చేస్తే మెరుగైన ఫలితాలు!
ఆహారంతోనే పిల్లల ఆరోగ్యం
రాష్ట్రంలో రెండు రోజులు మోస్తరు వానలు
దేశంలో 30.72 టీకా డోసుల పంపిణీ : ఆరోగ్యశాఖ
శ్రీశైలం జలాశయానికి వరద
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
‘నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి’
రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ విజేత నల్లగొండ జట్టు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

