e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News దేశంలో 30.72 టీకా డోసుల పంపిణీ : ఆరోగ్యశాఖ

దేశంలో 30.72 టీకా డోసుల పంపిణీ : ఆరోగ్యశాఖ

దేశంలో 30.72 టీకా డోసుల పంపిణీ : ఆరోగ్యశాఖ

న్యూఢిల్లీ : కరోనాకు వ్యతిరేకంగా టీకా డ్రైవ్‌ దేశంలో ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 30.72 కోట్ల టీకాలకుపైగా పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం మొత్తం 30,72,46,600 డోసులు వేసినట్లు పేర్కొంది. గురువారం నాటికి టీకా డ్రైవ్‌ 160వ రోజుకు చేరగా.. రాత్రి 7 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.. గురువారం ఒకే రోజు 54.07లక్షలకు పైగా వ్యాక్సిన్ మోతాదులు వేసినట్లు పేర్కొంది. 18-44 సంవత్సరాల మధ్య వయసున్న 35,44,209 మంది లబ్ధిదారులకు తొలి డోసు.. 67,627 రెండో మోతాదులు వేసినట్లు తెలిపింది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడో దశ టీకా డ్రైవ్‌లో 7,43,45,835 మంది మొదటి.. మరో 15,70,839 మందికి రెండో మోతాదు వేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో పదిలక్షలకుపైగా 18-44 మధ్య వయసు వారికి టీకాలు వేసినట్లు వివరించింది.

ఇవి కూడా చదవండి..

ఈ వేళ‌లో వ్యాయామం చేస్తే మెరుగైన ఫ‌లితాలు!
ఆహారంతోనే పిల్లల ఆరోగ్యం
రాష్ట్రంలో రెండు రోజులు మోస్తరు వానలు
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దేశంలో 30.72 టీకా డోసుల పంపిణీ : ఆరోగ్యశాఖ
దేశంలో 30.72 టీకా డోసుల పంపిణీ : ఆరోగ్యశాఖ
దేశంలో 30.72 టీకా డోసుల పంపిణీ : ఆరోగ్యశాఖ

ట్రెండింగ్‌

Advertisement