మిర్యాలగూడ, సెప్టెంబర్ 1: రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ఈ నెల 3న మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌కుమార్ పేర్కొన్నారు.
మంగళవారం ఎన్నెస్పీ క్యాంపు గ్రౌండ్‌ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నెస్పీ క్యాంపు గ్రౌండ్లో ధర్నా చేసుకోవడానికి పోలీసులు అనుమతించారని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారని తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ధర్నా ప్రారంభమవుతుందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు.