దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏండ్లు అయింది. మొదటి రెండు తరాల రాజకీయ నేతలతో చాలామంది స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నవారు, మిగతావారు ఆ
సమరాన్ని చూసి ప్రేరణ పొందినవారు, ఇంకొంతమంది ఉన్నత విద్యావంతులు దేశంలో ఎన్నికల్లో పాల్గొని వివిధ రంగాలను స్థాపన నుంచి ప్రగతి మార్గంలో నడిపారు. అయితే మూడో తరం నాయకులు వచ్చినప్పటి నుంచి దేశ ప్రగతి అంత వేగంగా జరుగలేదు. దానికి ముఖ్యంగా రెండు కారణాలు పేర్కొనవచ్చు.
అసలు నరేంద్రమోదీ
చేసిన మొట్టమొదటి నోట్ల రద్దుతోనే ప్రజలు ఆ పాలన ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సింది. ఉగ్రవాదుల దాడులు తగ్గలేదు. నోట్ల రద్దు వల్ల రోడ్డు పక్కన సరుకులు అమ్ముకునేవాళ్లు, చిరు వ్యాపారులు 35 లక్షల మంది ఉపాధి కోల్పోయారు.
ఒకటి ప్రగతికి ముఖ్యమైన అంశం వనరులకు తగిన జనాభా ఉండటం. అయితే ఆ అంశం గురించి 1970 వరకు జాగ్రత్త తీసుకోకపోవటంతో 1947లో 34 కోట్ల జనాభా కాస్తా చాపకింద నీరులా 1960 నాటికి 55 కోట్లకు పెరిగింది. సామాన్య ప్రజల ప్రగతికి ముఖ్యమైన విద్య, వైద్యం ఉపాధి రంగాల్లో జనాభా, వనరులు సరైన నిష్పత్తిలో లేకపోయాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించగలిగినా అప్పటికే స్వాతంత్య్రం ఎంతమంది ఎంత కష్టపడితే వచ్చిందో తెలియని తరంలోంచి నాయకులు ఎన్నికలు గెలిచి పరిపాలకులయ్యారు. ఆ విలువ తెలియకపోవటం ఒక కారణమైతే, దేశ వనరుల వల్ల లభించిన ధనరాశులు వారిలో దురాశను పెంచి, అవినీతి పెరిగింది. దీనికి ముఖ్య కారణం రాజకీయ నాయకులకు కనీస విద్యా స్థాయి ఉండాలన్న నిబంధన లేకపోవటమే. రెండవ కారణం విద్యారంగంలోని లోపాలు. భారత దేశ సంస్కృతిని అనుసరించి విధానాలను ఏర్పరచకుండా, నెహ్రూ కాలం నుంచే పాశ్చాత్య విద్యావిధానాలు అనుకరించటంతో అవి చదువుకున్న వారిని కూడా వ్యక్తిత్వం, విలువలు కలిగిన వారిగా తీర్చిదిద్దలేకపోయాయి.
రాజ్యాంగంలో కూడా ఎన్నికయిన అభ్యర్థుల మీద ఐదేండ్ల వరకు ప్రజలకు ఏ విధంగానూ జవాబుదారీతనం వహించే నిబంధనలు లేకపోవడంతో, అవినీతి, బంధుప్రీతి, అక్రమాలు విపరీతంగా పెరిగాయి. దానికితోడు 1970 నుంచి వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై, ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేసి తాము లాభపడటంతో నిష్ణాతులైపోవడం అత్యంత శోచనీయం! అయితే 1947 నుంచి, జనతా పార్టీ తక్కువ కాలం, కాంగ్రెస్ ఎక్కువ కాలం కేంద్రంలో రాష్ర్టాల్లో వివిధ రంగాల్లో కొంత ఆయా అంశాల్లో నిపుణులను అధికారులుగా నియమించటం, ఈ రాష్ట్ర పరిపాలనలో కేంద్రం కొంత వారికి స్వేచ్ఛనివ్వడంతో, రాష్ర్టాల స్థాయిలో మంచి నాయకులు వచ్చినప్పుడు కొంత అభివృద్ధి జరిగింది. ప్రజాభిప్రాయానికి కొద్దిగా పాలకులు తలవంచేవారు. 2014 ముందు దేశంలో జరుగాల్సినంత అభివృద్ధి జరుగకపోయినా, మరీ దేశం వెనుకబడిపోయిందని కూడా అనలేం. అయితే పాలకులకు దూరదృష్టిలేక సరైన నిబంధనలతో ఉన్నత విద్యావంతులను దేశంలో ఒక పదేండ్లయినా సేవ చేయాలన్న చిన్న నిబంధన కూడా విధించకపోవడంతో అమితంగా మేధోవలస జరిగి, దేశం నష్టపోయింది.
ఇక 2014 నుంచి కృతయుగంలోని హిరణ్యకశిప, హిరణ్యాక్షులు గుర్తువచ్చేటట్టుగా ఒకే పార్టీ కేంద్రంలో పరిపాలన చేస్తున్నది. హిరణ్యాక్షుడు భూమిని చుట్టచుట్టి అధోలోకంలోకి విసరబోతే, హిరణ్య కశిపుడులాగా ప్రస్తుత ప్రధానమంత్రి గుడి కట్టించుకుని పూజలందుకోబోతున్నారు. అంతేకాదు, ఆ భూమి మీద సంపద అంతా తన ఆత్మీయులకు దోచిపెడుతున్నారు. 2014 నుంచి పాలకులకు, ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఈ 12 ఏండ్లలో ప్రజాహిత రంగాలైన విద్య, వైద్యం, వ్యవసాయం వంటి వాటి మీద చర్చ లేదు. పాలకులు వారు చేయదలచుకున్న పనులకు, అక్రమాలతో సంపాదించిన ప్రజా నాయకుల పశుబలంతో ఆమోదం తెచ్చుకుని తమ లాభాలు చూసుకుంటూ పాలన చేస్తున్నారు. దేశంలోని ఏ ఒక్క విషాద ఘటన, ప్రకృతి వైపరీత్యాలు, నేరాలు, అన్యాయాలు, బలవంతుల దాష్టీకాలు తమకు సంబంధించినవి కాదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. మీడియా మొత్తం ‘మోడియా’ అయిపోయింది. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కూడా ప్రజలకు కాకుండా రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో ఉన్న ఒకే ఒక ఆయుధం ‘ఓటు’. అది ఆ వ్యవస్థ కూడా అవినీతికూపం అవటంతో ఎవరి ఓటు వారు స్వతంత్రంగా వేసుకునే వీలు లేకుండా పోయింది. ఇప్పుడు కేంద్రంలో, ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాల్లో పాలకులు సామాన్య ప్రజలకు శత్రువుల్లా పరిపాలిస్తున్నారు. ఎదురు తిరిగినవారు సజీవంగా ఉంటారన్న ఆశ లేకుండా కేవలం నియంతల పాలన సాగుతున్నది. ఇక ప్రతిపక్షాల్లో గెలిచిన నాయకులను గాడిదల వేలంలో (ఇది వరకు హార్స్ ట్రేడ్ అనేవారు) కొనేయటం, లొంగకపోతే కేసులు పెట్టటం వంటివి సామాన్య ప్రజలకు సంబంధంలేకపోయినా, వ్యవస్థ ధ్వంసమయిపోతున్నది. సామాన్యుల దగ్గర దోపిడీ, ధరల విపరీత పెరుగుదల, జీఎస్టీలు కలిపి వారి బతుకులు ఛిద్రమవుతున్నాయి. 2014 వరకు 19 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన ఉంటే, విశ్వగురు పాలనలో ఇంకో 20 కోట్ల మంది మధ్య తరగతి నుంచి కిందికి జారి, వారిలో కలిసి మొత్తం 39 కోట్ల మంది సరైన భోజనం ఒక్కపూటకు కూడా నోచుకోకుండా ఉన్నారు.
అసలు నరేంద్రమోదీ చేసిన మొట్టమొదటి నోట్ల రద్దుతోనే ప్రజలు ఆ పాలన ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సింది. ఉగ్రవాదుల దాడులు తగ్గలేదు. నోట్ల రద్దు వల్ల రోడ్డు పక్కన సరుకులు అమ్ముకునేవాళ్లు, చిరు వ్యాపారులు 35 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. మోదీ చెప్పిన విషయం ఒకటి 40,000 శౌచాలయాలు కట్టామని. పోనీ కట్టినా 90,000 పాఠశాలలు మూసిన వారి మేధాస్థాయి ఎంతలో ఉందనుకోవాలి? ఇక ఆయనకు మిత్ర, శత్రు, మిత్రుడు చంద్రబాబు, ఆయన అనుంగు శిష్యుడు రేవంత్‌రెడ్డి గురించి ఒక్క విషయం చెప్పుకొంటే చాలు. పెద్ద స్కీములు ప్రకటించటం, వాటికి ఎట్లాగో గ్రాంట్లు తెప్పించుకుని తమ జేబులో వేసుకోవటం. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి కొద్దిగా నయం. తను సంపాదిస్తున్న కోట్ల రూపాయల అక్రమ ధనంలో కొంత తన సోదరులకు ఇస్తాడు. ఇదీ ఈ ముగ్గురి ప్రజాపాలన. ఈ పదానికి అర్థం ఏమిటంటే, ‘మా ఇష్టం వచ్చినట్టు మేం దోచేస్తాం, ప్రజలు వారి సంగతి వారే చూసుకోవాలి’ అని. ఇక ప్రజలే జాగ్రత్త పడాలి!
కొన్ని ఉదాహరణలు చూద్దాం
1. మణిపూర్‌లో స్త్రీలకు జరిగిన అవమానానికి, అది చేసిన నాయకుల దాష్టీకానికీ ఈ రోజు దాకా సరిదిద్దటం కాదు కదా, ప్రధానమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ మంత్రులు ముఖాలు చాటేయడం అవసలు ఎవరికీ అర్థం కాని విషయం.
2. వ్యవసాయంలో కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేలా చేసిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వ్యవసాయదారులు, రైతులు ఏడాది కంటే ఎక్కువకాలం (378 రోజులు) రోడ్ల మీదే కూర్చుని నిరసన తెలిపారు. పాలకులు అన్నం తింటారో, డబ్బే తింటారో తెలియదు కానీ, ఒక్కరోజు వారి దగ్గరకు వెళ్లి సమస్య గురించి చర్చించలేదు. ఆ సమయంలో 750 మంది రైతులు మరణించారు. అయినా దున్నపోతులకు చినుకు మీద పడ్డట్టు కూడా కాలేదు.
3. అంతర్జాతీయ ఖ్యాతి చెందినవారూ, ఇంకా ఆ పోటీల్లో పాల్గొనాలని ప్రయత్నిస్తున్నవారూ యువతులు తమ రంగంలో అధికారి అయిన బ్రిజ్‌భూషణ్ అనే నికృష్టుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసన చేపట్టారు. వారికి సమాధానం చెప్పకపోగా, అతని మీద చర్య తీసుకోవాల్సిన పాలకులు అతనికి సన్మానాలు చేశారు, నిరసన తెలుపుతున్న ఆ యువతులను పోలీసులు ఈడ్చిపారేశారు. అయినా గుజరాత్లో బిల్కిస్ బానో అనే గర్భిణి మీద పది మంది అత్యాచారం చేసి, గర్భస్థ శిశువును, ఆమె మూడేండ్ల కూతురునే కాకుండా, 11 మంది ఆమె కుటుంబ సభ్యులను అడ్డంగా, నిలువుగా నరకగలిగిన కార్యకర్తలున్న నాయకులకు మనుష్య గుణాలున్నాయని అనుకోవాలా? రాక్షసులని అనుకోవాలా?
4. ఆంధ్రప్రదేశ్, బెంగాల్లో ఎన్నికలయ్యాక ఈవీఎంలను ఎందుకు తగలబెట్టారో బీజేపీ చెప్పగలదా?
కనకదుర్గ దంటు
8977243484