హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారికి లకీడ్రా నిర్వహించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ డ్రాలో ఒక్కో రీజియన్‌కి ముగ్గురి చొప్పున 33 మందిని ఎంపికచేసి, వారికి రూ.5.50 లక్షల విలువైన బహుమతులను అందజేయనున్నట్టు గురువారం తెలిపింది.
ఒకో రీజియన్‌కు ప్రథమ బహుమతి రూ.25వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలుగా ప్రకటించింది.పూర్తి వివరాలకు 040-69440000, 040-23450033 నంబర్లతోపాటు స్థానిక డిపో మేనేజర్లను సంప్రదించాలని సూచించారు.