కీసర: సంచలనం సృష్టించిన శ్వేత కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. పోలీసులు శ్వేతను సురక్షితంగా భర్తకు అప్పగించారు. కిడ్నాప్‌నకు పాల్పడిన 9 మందిలో ఏడుగురిని అరెస్టు చేశారు. బుధవారం నర్సంపల్లిలో శ్వేతను ఆమె తల్లిదండ్రులు బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని రెండు బృందాలతో గాలించారు.
గురువారం రాత్రి పోలీసులు ఎట్టికేలకు శ్వేత ఆచూకీ కనిపెట్టారు. శామీర్‌పేట మండలం పొన్నాల్ గ్రామంలో వారి కుటుంబీకుల వద్ద దాచిపెట్టిన శ్వేతను కలిశారు. తాను భర్తతోనే ఉంటానని పోలీసుల ఎదుట ఆమె కన్నీరు పెట్టింది. పోలీసులు ఆమెను నేరుగా పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి భర్త ప్రవీణ్‌కు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న ఏడుగురిని శుక్రవారం ఉదయం కోర్టుకు సరెండర్ చేస్తామని కీసర సీఐ ఆంజనేయులు తెలిపారు.