హైదరాబాద్, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): ఉచిత చేపపిల్లల టెండర్లు తుది దశకు చేరాయి. మూడు విడతలు వాయిదా పడిన అనంతరం ఎట్టకేలకు ఈనెల 12న టెండర్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. మొత్తం 80 టెండర్లు దాఖలు కాగా, 14 టెండర్లు తిరస్కరణకు గురైనట్టు మత్స్యశాఖ అధికారులు తెలిపారు.
మొత్తం 66 టెండర్లు అర్హత సాధించినట్టు వెల్లడించారు. అర్హత సాధించిన 66 టెండర్లలో తుది బిడ్లను శనివారం ఖరారు చేసే అవకాశాలున్నాయని తెలిపారు.