వరంగల్ చౌరస్తా: వరంగల్ నుంచి ప్రయాణికులతో ఖమ్మం వెళుతున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు (TG03T1321) శివనగర్ అండర్ బ్రిడ్జ్ బారికేడ్ల మధ్య ఇరుక్కుపోయింది. బస్సు పై ఎత్తుగావున్న భాగం కొంత పాక్షికంగా దెబ్బతింది. బారికేడ్లకు తగిలిన విషయం గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు.
పరిస్థితిని గమనించి బస్సును ముందుకు తీసుకువెళ్లడానికి టైర్లలో గాలిని తొలగించి బయటకు తీశారు. అండర్ బ్రిడ్జి కింద బస్సు ఇరుక్కుపోవడంతో సుమారు అరగంట పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. వాహనదారులు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ పోలీసులు భారీ వాహనాలను దారి మళ్లించారు.