అమ్రాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రబాద్ మండలంలోని పగవరపల్లి-దోమలపెంట మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వారిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా గుర్తించారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి, డీసీపీ సుధాకర్ పాతరే మరో వ్యక్తితో కలిసి శ్రీశైలం వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మరో వ్యక్తి సుధాకర్ పాతరే తోడల్లుడు భగవత్ ఖొడాకేగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. డీసీపీ సుధాకర్ పాతరే మహారాష్ట్ర పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈయన 2011 బ్యాచ్‌కు చెందిన మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి.