హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను రాష్ట్రంలో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. ఇండ్ల వద్దకు వెళ్లి విధులు నిర్వహించే బూత్‌లెవల్ అధికారులు(బీఎల్వోలు), బీఎల్వో సూపర్వైజర్లకు తగిన భద్రత, పూర్తి సహకారం అందించాలని, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అకడ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని కోరారు. ‘సర్’ కార్యక్రమ నిర్వహణ, భద్రతా ఏ ర్పాట్లపై సోమవారం బీఆర్కే భవన్‌లోని సీఈవో కార్యాలయం నుంచి అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్ సౌత్ రేంజ్ అదనపు పోలీస్ కమిషనర్(లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్‌తో కలిసి సీఈవో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సీఈవో మాట్లాడుతూ.. రా ష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. హైదరాబాద్ సౌత్ రేంజ్ అదనపు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం చేపట్టే ఈ కీలక ప్రక్రియకు పోలీస్ శాఖ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు, జీహెచ్ఎంసీ కమిషనర్, ఆయా జిల్లాల పోలీస్ కమిషనర్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.