రేవంత్‌ది ఫాసిస్టు భావజాలం.. హిట్లర్ వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరం
ప్రపంచ నియంత హిట్లర్ నుంచి తాను స్ఫూర్తి పొందానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని, ఆ వ్యాఖ్యలు ఆయనలో ఉన్న ఆర్ఎస్ఎస్ మూలాలు, ఫాసిస్టు భావజాలాన్ని బయటపెట్టాయని కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ స్పష్టంచేశారు.
- ఆర్ఎస్ఎస్ మూలాలు బయటకు
- కాంగ్రెస్ అధిష్ఠానం సమాధానం చెప్పాలి : పినరయి విజయన్
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ నియంత హిట్లర్ నుంచి తాను స్ఫూర్తి పొందానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని, ఆ వ్యాఖ్యలు ఆయనలో ఉన్న ఆర్ఎస్ఎస్ మూలాలు, ఫాసిస్టు భావజాలాన్ని బయటపెట్టాయని కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో పేదల ఇండ్లను కూల్చేందుకు చేపట్టిన హైడ్రా ప్రాజెక్టును.. హిట్లర్ స్ఫూర్తితో చేపట్టినట్టు రేవంత్ చెప్పుకోవడం తీవ్ర దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు. రేవంత్ హిట్లర్ వ్యాఖ్యలపై దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సమాధానం చెప్పి తీరాలని సోమవారం ఎక్స్ వేదికగా విజయన్ డిమాండ్ చేశారు.
తన బుల్డోజర్ రాజ్‌ను సమర్థించుకొనేందుకు హైడ్రా గురించి బహిరంగంగా గర్వంగా భావిస్తున్నట్టు పేర్కొనడం గర్హనీయమని పేర్కొన్నారు. హింస, నిరంకుశత్వానికి కేంద్ర బిందువైన ఓ వ్యవస్థను స్ఫూర్తిగా తీసుకొని, ప్రజాస్వామ్య దేశంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా బహిరంగంగా మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నోరు జారడమే కాదని, ఇది కాంగ్రెస్ అంతర్గత క్యారెక్టర్‌ను బయటపెడుతుందని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారిపట్ల ప్రజాస్వామిక వాదులు జాగరూకతతో ఉండాలని హెచ్చరించారు. హిట్లర్‌ను స్ఫూర్తితో హైడ్రా ఏర్పాటు చేసినట్టు రేవంత్ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.
బయటపడిన కాంగ్రెస్ అంతర్గత క్యారెక్టర్
హిట్లర్ వ్యాఖ్యలతో సీఎం రేవంత్ నోరు జారడమే కాదని, కాంగ్రెస్ అంతర్గత క్యారెక్టర్‌ను బయటపెట్టిందని పినరయి విజయన్ పేర్కొన్నారు. హిట్లర్‌ను కీర్తిస్తున్న రీతిలో కాంగ్రెస్ సీఎం మాట్లాడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. రేవంత్‌కు గతంలో సంఘ్‌పరివార్‌తో లింకులు ఉన్నాయని, ఆ ప్రభావం కూడా రేవంత్ వ్యాఖ్యల్లో ప్రస్ఫుటమైందని తెలిపారు. సీఎం వ్యాఖ్యలు.. ఆ పార్టీ ఎప్పటికీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకించలేదన్న అంశాన్ని తేటతెల్లం చేసిందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

