తడిసిన ధాన్యం , కొనుగోలు చేయాలని ధర్నా
వర్షానికి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ మండలంలోని అన్నారం గ్రామంలో సోమవారం రైతులు ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కాంటా పూర్తయి వర్షానికి తడిసిపోయిన ధాన్యాన్ని పక్కనబెట్టి, కేవలం తడవని ధాన్యాన్ని మాత్రమే లారీల్లోకి లోడ్ చేశారు.
- అన్నారంలో వడ్లకు నిప్పుపెట్టి రైతుల నిరసన
రామారెడ్డి, జూన్ 8: వర్షానికి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ మండలంలోని అన్నారం గ్రామంలో సోమవారం రైతులు ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కాంటా పూర్తయి వర్షానికి తడిసిపోయిన ధాన్యాన్ని పక్కనబెట్టి, కేవలం తడవని ధాన్యాన్ని మాత్రమే లారీల్లోకి లోడ్ చేశారు. రెండు నెలల క్రితం పంటను కోసి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఆరబెట్టగా వర్షాలకు అది తడిసిపోయింది. దీంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయబోమంటూ కేంద్రం నిర్వాహకులు చెప్పడంతో కోపోద్రిక్తులైన రైతులు ఆందోళన చేపట్టారు.
తడిసిన ధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి వాటికి నిప్పుపెట్టి నిరసన వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. రైతులు ససేమిరా అనడంతో ఎస్సై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, జిల్లా పౌర సరఫరాల అధికారులు రామ్మోహన్, వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఉమాలతతో కలిసి అక్కడికి చేరుకున్నారు. రైతులతో అదనపు కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. లారీలను పంపించి సమస్యను పరిష్కరించగా, రైతులు ధర్నా విరమించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

